పని చేయని పాన్‌కార్డుతో ఈ లావాదేవీలు చేయొచ్చు తెలుసా..? కానీ

-

ఆధార్‌కు పాన్‌ లింక్ చేయమని ఎప్పటినుంచో అధికారలు మొత్తకుంటున్నారు. లింక్‌ చేయకపోతే మీ పాన్‌ కార్డు పనిచేయదు, పెద్ద లావాదేవీలు చేయలేరు అని ప్రచారం కూడా చేశారు. కొంతమంది చేయించుకున్నారు. కానీ కొందరు మహానుభావులు ఇంకా ఆధార్‌కు పాన్ లింక్‌ చేయలేదు. పాన్‌ కార్డు పనిచేయకపోతే ఎలాంటి ట్రాన్సాక్షన్స్‌ చేయలే అనుకుంటారు. పాన్ కార్డు పని చేయకపోయినప్పటికీ కొన్ని ట్రాన్సాక్షన్లు పూర్తి చేయవచ్చు. అవేంటంటే..

పాన్ కార్డ్ లేకున్నా లేదా చెల్లుబాటులో లేకపోయినా కొన్ని ఆర్థిక లావేదేవీలు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే రెగ్యులర్‌తో పోలిస్తే టీడీఎస్, టీసీఎస్ కాస్త ఎక్కువగా కట్ అవుతాయని వెల్లడించారు. ఇందుకు ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టంలో ప్రత్యేక మినహాయింపులు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం 1961లో 206AA, 206CC సెక్షన్లు ఈ మేరకు తోడ్పడతాయని సూచించారు. టీడీఎస్‌కి సంబంధించి చేసే ట్రాన్సాక్షన్ సమయంలో పాన్ కార్డ్ సమర్పించక పోయినా లేదా పాన్ చెల్లకపోయినా అమౌంట్‌లో 20 శాతం ట్యాక్స్ కట్ అవుతుందట. ఇదే విధంగా, సెక్షన్ 206CC ప్రకారం ఎక్కువ టీసీఎస్ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ టీసీఎస్ 5 శాతం వరకు ఉండవచ్చన్నారు.

పాన్ కార్డ్ లేకున్నా కొన్ని లావాదేవీలు జరిపేందుకు వీలుంటుంది. కానీ, ఎక్కువ టీడీఎస్, టీసీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. అధిక టీడీఎస్‌ చెల్లించి బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా రికరింగ్ డిపాజిట్ల రూపంలో ఒక ఏడాదిలో రూ.40 వేలకు పైగా ఆర్జించొచ్చు. రూ.50 లక్షలకు పైగా విలువతో స్థిరాస్తులు అమ్మితే వీటికి ఎక్కువ టీడీఎస్ చెల్లించాలి.

ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 5 వేలకు పైగా మ్యూచువల్ పండ్స్ లేదా డివిడెండ్ రూపంలో సంపాదించొచ్చు. పాన్‌తో సంబంధం లేకుండా టీడీఎస్ ఎక్కువ చెల్లించి రూ.10 లక్షలకు పైగా విలువైన వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. ఈపీఎఫ్ అకౌంట్ నుంచి రూ.50 వేలకు పైగా విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే, టీడీఎస్ ఎక్కువగా కట్ అవుతుంది.

నెలకు రూ.50 వేల కన్నా ఎక్కువ అద్దె చెల్లించడానికి పేమెంట్ చేయవచ్చు. రూ.50 లక్షలకు పైగా విలువైన వస్తువులు, సేవలను విక్రయించవచ్చు. రూ.15 వేల కన్నా ఎక్కువైన బ్రోకరేజీ పేమెంట్స్ లేదా కమీషన్ తీసుకుంటే ఎక్కువ టీడీఎస్ కట్ అవుతుంది. వీటికి పాన్ కార్డుతో పనిలేదు. అలా అని పాన్‌కార్డు లేకుండా అనవసరంగా ఎక్కువ టీడీఎస్‌, టీసీఎస్‌ ఎందుకు పే చేయడం..? ఆ పని ఏదో చేసుకుంటే సరిపోతుంది కదా.!

Read more RELATED
Recommended to you

Exit mobile version