రిస్క్‌లో విశాఖ.. ఇలాగైతే కేసులు తప్పవని హెచ్చరించిన ప్రభుత్వం.. ?

-

కరోనా క్రమక్రమంగా ముఖ్యనగరాల్లో ప్రభలుతున్న నేపధ్యంలొ ఇప్పటికే ఆయా ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి.. ఇలాంటి సమయంలో ఏపీలో కూడా కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తుంది.. దీని వల్ల రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇకపోతే ప్రభుత్వం కూడా పదే, పదే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తోంది.

కానీ కొందరు మాత్రం ప్రభుత్వ సూచనల్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు రోడ్లపై తిరుగుతున్నారు. వీరి విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.. ఇకపై బయటకు వచ్చినవారు ఎవరైనా మాస్కులు పెట్టుకోకపోతే జరిమానా విధించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా విశాఖ పోలీసులు మాస్క్ తప్పనిసరి చేశారు. ఒకవేళ ఎవరైనా మాస్క్‌ ధరించక నగరంలో కనిపిస్తే వారికి రూ.100 జరిమానా విధిస్తున్నట్లు విశాఖ పోలీసు కమిషనర్‌ ఆర్‌.కె.మీనా తెలిపారు.

ఇదేగాక నగరంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా భౌతిక దూరం పాటించాలని, కాదని నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కాబట్టి ప్రజలందరు అధికారులు చెప్పిన సూచనలను తూచా తప్పకుండా పాటించి, మీ ఆరోగ్యాలను కాపాడుకోవడమే కాకుండా, మీ పర్సులు ఖాళీ కాకుండా చూసుకోవాలని కోరుతున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version