67 పేజీల సూసైడ్ నోట్..! కలకలం రేపుతున్న చర్టెడ్ అకౌంటెంట్ మర్డర్..!

-

charted accountant suicide and murder mystery
charted accountant suicide and murder mystery

తాను ఓ చార్టెడ్ అకౌంటెంట్..బెంగళూరు లో తన భార్యతో కలిసి నివాసముంటున్నాడు. భార్య భర్తల మధ్య గొడవలు జరగడం  కలహాలు ఏర్పడటంతో విడాకులకు అప్లై చేశారు. కానీ ఆ కోపంతో రగులుతున్నాడు, భార్యను ఎలాగైనా చంపాలని నిశ్చయించుకొని భార్యను చంపేశాడు ఆపై అత్తను కూడా చంపేశాడు చివరికి అతను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. చనిపోయేముందు సూసైడ్ నోట్ రాశాడు అది 67 పేజీల సూసైడ్ నోట్..! దాని పేరు మహా భారత్ ఆఫ్ మై లైఫ్ అని రాసుకున్నాడు. తన సూసైడ్ నోట్ చదివిన పోలీసులు కంగు తిన్నారు.

వివరాల్లోకి వెలితే.. అమిత్ అగర్వాల్ బెంగళూరు కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్, భార్య శిల్పా ఇద్దరు బెంగళూరు లోనే నివాసం ఉంటున్నారు. ఇద్దరికీ సరిగ్గా పడకపోవటం అనుమానాలు రావటంతో గొడవలు పడేవారు ఆ గొడవలు పెద్దవయ్యి విషయం  విడాకుల దాకా వెళ్లింది. భార్య పై కసితో రగులుతూ ఎలాగైనా ఆమెని చంపాలని డిసైడ్ అయ్యాడు. పాము తో కాటు వేయించడానికి ప్రయత్నించాడు స్వయంగా హత్య చేసేందుకు ప్రయత్నించాడు అలా మొత్తం 67 రకాలుగా ఆమెని చంపడానికి ప్లానింగ్ వేసుకున్నాడు. కానీ చివరికి తానే స్వయంగా రివాల్వర్ తో భార్యను కాల్చి చంపేశాడు. ఆపై అక్కడనుండి కలకత్తా లోని తన అత్త ఇంటికి వెళ్ళి ఆమెను కూడా అదే రివాల్వర్ తో కాల్చేశాడు, చివరికి తనకు తాను కూడా అదే రివాల్వర్ తో కాల్చుకొని చనిపోయాడు. చనిపోయేముందు తాను 67 పేజీల సూసైడ్ నోట్ ను రాశాడు అది చదివిన పోలీసులు సైతం షాక్ అయ్యారు. ఆ సూసైడ్ నోట్ కు మహా భారత్ ఆఫ్ మై లైఫ్ అని పేరు పెట్టాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version