వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్ట్ అయ్యారు. చేబ్రోలు కిరణ్ కుమార్ మీద దాడి చేసిన వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ కుమార్‌ను అరెస్ట్ చేసి మంగళగిరి తీసుకెళ్లారు పోలీసులు.

అయితే, చేబ్రోలు కిరణ్ కుమార్‌ను తీసుకెళ్తున్న వాహనాన్ని అడ్డగించారు గోరంట్ల మాధవ్. కిరణ్ అంతు చూస్తామని బెదిరించారు గోరంట్ల మాధవ్. ఈ తరుణంలోనే గుంటూరు వరకూ పోలీస్ వాహనాన్ని వెంబడించారు మాధవ్. ఇక తన విధులను అడ్డుకున్నారని మాధవ్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.