కంచ గచ్చిబౌలి భూముల అంశం.. కేంద్ర కమిటీకి తెలంగాణ ప్రభుత్వం నివేదిక

-

హైదరాబాద్ నగరంలోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం ఇటీవల రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది. అయితే ఈ అంశం కాస్త సుప్రీంకోర్టు దృష్టికి చేరడంతో దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నివేదిక అందజేయాలని కేంద్ర సాధికార కమిటీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో చ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని పరిశీలించేందుకు కేంద్ర సాధికారిక కమిటీ హైదరాబాద్‌కు వచ్చింది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది.

అనంతరం పర్యావరణ, అటవీ శాఖల కేంద్ర సాధికారిక కమిటీతో తెలంగాణ ప్రభుత్వ అధికారులు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో కంచ గచ్చిబౌలి భూములపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీకి నివేదిక సమర్పించింది. ఇక అంతకుముందు కంచ గచ్చిబౌలి భూముల్లో పరిశీలన చేసిన సాధికార కమిటీ వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయనుంది. మరోవైపు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు నేతృత్వంలోని బృందం సైతం గచ్చిబౌలి భూముల వ్యవహారంపై కమిటీకి నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కమిటీ.. సుప్రీం కోర్టుకు సమర్పించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news