“వైఎస్సార్ ఆత్మ” విశ్వాసంపై రూమర్లు… పెద్ద రూమరే!

-

రాజకీయాల్లో శాస్వత శత్రువులు, శాస్వత మిత్రులు ఉంటారా? ఈ విషయంలో పార్టీలకు అతీతంగా అందరూ ఒక్కతాటిపైకి వచ్చి చెప్పే సమాధానం “ఉండరని”. కానీ “ఉంటారని” నిరూపించేలా ప్రవర్తించారన్న పేరు కేవీపీ దాదాపు సంపాదించుకున్నారు. కానీ జగన్ ని కాంగ్రెస్ ఇబ్బంది పెట్టిన సమయంలో, ప్రాణ స్నేహితుడి కొడుక్కి అంత ఇబ్బంది వస్తే ఆయన ఏమయ్యారు? కాంగ్రెస్ పార్టీపై అభిమానంతో మధ్యలోకి రాలేకపోయారేమో అని కొందరు సరిపెట్టుకున్నా… అక్కడినుంచి మొదలయ్యయి.. కేవీపీ విశ్వాసంపై సామాన్యుడికి అనుమానాలు!

ఆ సంగతి కాసేపు పక్కనపెడితే… రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నంతకాలం ఆయన పేరు చెబితే మరో పేరు ఆటోమెటిక్ గా వచ్చేసేది.. అదే కేవీపీ (వైఎస్సార్ ఆత్మ)! అవును.. ఆస్థాయిలో రాజశేఖర్ రెడ్డి – కేవీపీ బంధం ఉండేది. నాడు వైఎస్సార్ కి ప్రాణస్నేహితుడిగా ఉన్న వ్యక్తే నేడు జగన్ కి రాజకీయంగా శత్రువుగా, ప్రాణ శత్రువుగా మారబోతున్నాడంటూ కథనాలు వస్తున్నాయి. జగన్ వల్ల అన్నిరకాలుగానూ నష్టపోతున్న ఒక వర్గం వారు.. ప్రస్తుతం కేవీపీని ఆశ్రయించారని, ఆయన కనుసన్నల్లో నడవడానికి నిర్ణయించుకున్నారని.. ఈ సమయంలో కేవీపీ చేయాల్సింది ఒక్కటే అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఎంత అవునన్నా కాదన్నా నాడు రాజశేఖర్ రెడ్డి కోటరీ వేరు – కేవీపీ కోటరీ వేరు కాదు! కానీ వైఎస్సార్ కోటరీ కేవీపీ కోటరీగా, కేవీపీ కోటరీ వైఎస్సార్ కోటరీగా కలిసిపోయిందేమో కానీ… కేవీపీ కోటరీ పూర్తిగా జగన్ కోటరీ కాదు అని లాజిక్కులు వినిపిస్తున్నాయి. అందుకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి… గత కొన్ని రోజులుగా ఉండవల్లి అరుణ కుమార్, రఘురామకృష్ణం రాజు మొదలైనవారు జగన్ ను టార్గెట్ చేసి చేస్తున్న విమర్శలు! ఇదే క్రమంలో జగన్ వల్ల పూర్తిగా అన్ని రకాలుగా దెబ్బతింటున్నామని ఆలోచనలో ఉన్న ఒక వర్గం కేవీపీని కలిసి… జగన్ పార్టీలో ఉన్న తన వర్గాన్ని బీజేపీలోకి లాగెయ్యమని కోరుతున్నారంట. ఇది వినడానికి పగటి కల, పచ్చి భ్రమలా అనిపించినా.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కదా అనేమాటలు వినిపిస్తున్నాయంట!

అలాకానిపక్షంలో… జగన్ ని తట్టుకోవడం, ఎదుర్కోవడం ఇప్పట్లో సాధ్యమయ్యేపనిలా అనిపించడం లేదని అంటున్నారట! దానికి కేవీపీ ఒక్కరే ఒప్పుకుంటే చాలదు.. బీజేపీ అధిష్టాణం హస్తం కూడా పుష్కలంగా ఉండాలి. ఈ పరిస్థితుల్లో కమలం పెద్దలు.. సక్సెస్ అవుతాదో లేదో తెలియని ఇంత సాహసమైన పని చేస్తారా? అదీ డౌటే! ఆ అనుమానాలు పక్కనపెడితే… కేవీపీని పావుగా వాడి జగన్ ను దెబ్బకొట్టాలని జగన్ వైరిపక్షాలు సీరియస్ గా ఆలోచిస్తున్నాయని అంటున్నారు!

వారి ఆలోచనకు ఏముంది… ప్రతిపక్షంలో ఉన్నవారు, పైగా జగన్ లాంటి నేతకు ఆపోజిట్ గా ఉన్నవారు.. తమ మనుగడ ఎక్కడ ప్రశ్నార్ధకంగా మారుతుందో అనే భయంతో ఎన్ని ఆలోచనలు అయినా చెయ్యొచ్చు. మరి ఈ సమయంలో కేవీపీ వారి ఆలోచనలకు పావుగా మారతారా? ప్రాణ స్నేహితుడి బిడ్డకు అంత వెన్నుపోటు పొడుస్తారా? అంటే మాత్రం… కేవీపీ అలాంటి విశ్వాసఘాతకుడు కాదనే మాటలే వినిపిస్తున్నాయి.!

మొదట్లో చెప్పుకున్నట్లు శాస్వత శత్రువులు శాస్వత మిత్రులూ “ఉండరనే” వాదనతో కేవీపీ కూడా ఏకీభవిస్తే మాత్రం… వైఎస్సార్ ప్రాణస్నేహితులమని చెప్పుకునేవారితో జగన్ కు ఫైట్ తప్పకపోవచ్చు. వైఎస్సార్ ప్రాణ స్నేహితులు ఆయన బిడ్డపై ఇలాంటి పనులు చేస్తారా? చెయ్యరు అనే సమాధానం వెనకే… రాజకీయాలు కదా అనే భయం ఉండనే ఉంది!!

Read more RELATED
Recommended to you

Exit mobile version