ఆంధ్ర ప్ర‌దేశ్ లో ప్రారంభ‌మైన పోలింగ్

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో 10 zptc 123 mptc స్థానాల‌కు ఈ రోజు ఉద‌యం 7 గంట‌ల నుంచి పోలింగ్ ప్రారంభ‌మైంది. కాగ సోమ‌వారం కూడా ఆంధ్ర ప్ర‌దేశ్ లో స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు జరిగాయి. నెల్లూరు కార్పోరేష‌న్ తో పాటు 12 మున్సిపాలిటీ ల‌కు సోమ వారం ఎన్నిక‌లు జ‌రిగాయి. తాజాగా ఈ రోజు కూడా ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఉన్న ప‌లు zptc , mptc స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. పోలింగ్ ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది.

ఎన్నిక‌లు జ‌రుగుత‌న్న స్థానాల‌లో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఎన్నిక‌ల‌లో దాదాపు అన్ని స్థానాల‌లో ఆంధ్ర ప్ర‌దేశ్ లోని అధికార పార్టీ అయిన వైఎస్ఆర్‌సీపీ గెల‌వాల‌ని విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తుంది. అలాగే చంద్ర బాబు నేతృత్వం లోని టీడీపీ కూడా ప‌లు స్థానాల్లో పాగ వేయాల‌ని చూస్తుంది. అలాగే కొన్ని స్థానాల‌లో నైనా గెలిచి ప‌రువు కాపాడు కోవాల‌ని చూస్తుంది. అలాగే బీజేపీ కూడా కొంత మంది అభ్య‌ర్థుల‌ను బ‌రి లోకి దింపింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version