టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణ మురళికి ఇటీవలే గుంటూరు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఇవాళ ఉదయాన్నే జైలు నుంచి బయటకు రావాల్సి ఉన్నా.. జామీను ఆలస్యం కావడంతో సాయంత్రం సమయంలో విడుదలయ్యారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, పవన్ కళ్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన అరెస్టయిన విషయం తెలిసిందే.
ఈ వ్యవహారంలో ఏపీలోని పలు జిల్లాల్లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. అయితే ఇవాళ్టి వరకు ఆయన గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనారోగ్య కారణాలతో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. రెండ్రోజుల క్రితం వాదనలు జరిగాయి. ఈనెల 21వ తేదీకి తుదు తీర్పు రిజర్వ్ చేయగా.. శుక్రవారం రోజున సీబీఐ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల చొప్పున ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు మీద దేశం విడిచిపెట్టి వెళ్లకూడదనే నిబంధనలతో బెయిలు మంజూరు చేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది.