చంద్రబాబు భార్య భువనేశ్వరిపై పోసాని సెటైర్లు..!

-

స్కిల్ డెవలఫ్ మెంట్ స్కామ్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు నాయుడు ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే జైలులో ఉన్నా కూడా ప్రజల కోసమే ఆలోచిస్తారని ఆయన భార్య నారా భువనేశ్వరి పేర్కొన్నారు. అయితే తాజాగా ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళి మండిపడ్డారు. చంద్రబాబు జైలులో సైతం ప్రజల కోసమే ఆలోచిస్తున్నాడని అనడం దుర్మార్గమని.. నారా భువనేశ్వరి సానుభూతి రాజకీయం చేయడం పై మండి పడ్డారు పోసాని. ఆనాడు మీ నాన్న ఎన్టీఆర్ ను చెప్పుకొట్టించింది కూడా ప్రజల కోసమేనా అని పేర్కొన్నారు.

మీనాన్న ను వెన్నుపోటు పొడిచింది ప్రజల కోసమేనా అని ప్రశ్నించారు పోసాని. ఎన్టీఆర్ పదవీని చంద్రబాబు అక్రమంగా లాక్కున్నారని.. ఎన్టీఆర్ పై చెప్పులతో చేయించింది కూడా చంద్రబాబే అన్నారు. ఈ విషయాలు నారా భువనేశ్వరికి గుర్తుకు లేవా అని నిలదీశారు. ఇదిలా ఉంటే.. రాజమండ్రి సెంట్రల్ జైలులో కుట్రలు అంటూ.. ఈనాడు రామోజీ పిచ్చి రాతలు రాశారు. రామోజీ చనిపోతే ఆయన కుటుంబ సభ్యులు వెళ్లరా..? రాజమండ్రి జైలర్ పై ఈనాడు తప్పుడు కథనాలు రాసిందని పేర్కొన్నారు. జైలు సూపరింటెండెంట్ రాహుల్ భార్య అనారోగ్యంతో మరణిస్తే రామోజీరావు పిచ్చిరాతలు రాయడం వెనుక ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version