విశాఖ చావులు ఎంత భయంకరమో చెబుతున్న పోస్టుమార్టం రిపోర్ట్!

-

కారణం ఏమైనా… కారకులు ఎవరైనా… విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి స్టైరీన్ గ్యాస్ లీక్ అయిన సంఘటన అత్యంత దురదృష్టకర సంఘటనే! ఈ క్రమంలో ఈ దుర్ఘటన వల్ల 12 మంది ప్రాణాలు కోల్పోగా, వందల మంది ఇబ్బందిపడ్డారు… వేల సంఖ్యలో మూగజీవాలు అసువులు బాశాయి! ఈ క్రమంలో తాజాగా ఈ గ్యాస్ లీక్ సంఘటనలో చనిపోయిన 12మందికి సంబందించి విడుదలయిన పోస్టుమార్టం రిపోర్ట్ చూసినవారికి మాత్రం కన్నీళ్లు ఆగవనే చెప్పాలి. ఆ 12 మంది చనిపోయే ముందు ప్రత్యక్ష నరకం చూసి ఉంటారనే విషయం తాజాగా స్పష్టమవుతుంది.

వివరాల్లోకి వెళ్తే… విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీకవగానే వారికి ఊపిరి ఆడకపోవడం, సృహ తప్పి పడిపోవడం.. ఈ సందర్భంగా శ్వాసతీసుకోవడం ఏమాత్రం జరగకపోవడం… దీంతో 12 మంది మృతి చెందారని అంతా అనుకున్నారు! కానీ… ఆ విషవాయువులు పీల్చిన తర్వాత బాధితుల రక్తంలో ఆక్సిజన్ శాతం ఒక్కసారిగా పడిపోయిందట.. దీంతో ఊపిరి ఆడక విలవిల్లాడుతూ వారు చనిపోయారని విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రి ఫోరెన్సిక్ వైద్యులు పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడించారు! ఇలా మరణించిన ఆ 12 మంది ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయని, వారి అవయువాలపై విషవాయువు ప్రభావం తీవ్రంగా చూపిందని డాక్టర్లు చెబుతున్నారు.

వైద్యులు చెప్పేది ఇలా ఉంటే… స్టైరీన్ గ్యాస్ వల్ల మనుషుల ప్రాణాలు పోవని.. కళ్లమంట, దురద దద్దుర్లు, శ్వాస అందకపోవడం వంటివి మాత్రమే కలుగుతాయని.. పైగా ఈ స్టైరీన్ గ్యాస్ ఒక కిలోమీటరు కంటే ఎక్కువ దూరం ప్రయాణించదని ఆంధ్రా యూనివర్సిటీ రసాయన శాస్త్ర విభాగం ప్రొపెసర్లు చెబుతున్నారు. దీంతో స్టైరీన్ లో వేరొక పదార్థాన్ని కలిపి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రొఫెసర్లు! అలా స్టైరీన్ లో కలిసిన వేరే పదార్ధం ప్రభావం వల్లే మనుషులు చనిపోయి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు! కానీ… ఇది కేవలం స్టైరీన్ గ్యాస్ లీక్ వల్లే జరిగిందని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ యాజమాన్యం అధికారికంగా చెబుతుంది. ఈ లెక్కన చూసుకుంటే… దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిందే అని బాధితులు, ప్రజలు కోరుకుంటున్నారు!!

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version