ఏప్రిల్‌ నెల మొత్తం విద్యుత్‌ కోతలు : ఏపీ విద్యుత్‌ శాఖ

-

ఏప్రిల్‌ నెల మొత్తం విద్యుత్‌ కోతలు ఉండే చాన్స్‌ ఉన్నట్లు ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న విద్యుత్‌ ఇబ్బందులు తాత్కాలికమేనని… గృహ, వ్యవసాయ వినియోగానికి ఆటంకాలు కలగకూడదనే పరిశ్రమల్లో విద్యుత్‌ వినియోగంపై ఆంక్షలు విధించామన్నారు. ప్రస్తుతం ఏపీలో 230 మిలియన్‌ యూనిట్ల మేర విద్యుత్‌ డిమాండ్‌ ఉందని.. ఏపీలో 180 మిలియన్‌ యూనిట్ల మేర విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోందని స్పష్టం చేశారు.

పరిశ్రమల్లో విద్యుత్‌ వినియోగంపై ఆంక్షల వల్ల 20 మిలియన్‌ యూనిట్ల మేర భారం తగ్గుతుందని.. పరిశ్రమల్లో ఆంక్షలు విధించినా.. మరో 30 మిలియన్‌ యూనిట్లను బహిరంగ మార్కెట్‌ నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోందని వెల్లడించారు. ఏప్రిల్‌ చివరి వారం వరకు విద్యుత్‌ ఇబ్బందులు ఉండే అవకాశం ఉందని… మరీ అవసరమైతే తప్ప.. గృహ, వ్యవసాయ విద్యుత్‌ సరఫరాలో కోతలు విధింబోమని స్పష్టం చేశారు. తప్పదనుకుంటే రూరల్‌ ప్రాంతాల్లో ఓ గంట సేపు.. అర్బన్‌లో అరగట సేపు విద్యుత్‌ కోతలు విధిస్తామని.. విద్యుత్‌ విషయంలో ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఇదే తరహా పరిస్థితి ఉందన్నారు. ఏపీలోని థర్మల్‌ పవర్‌ ప్లాంట్లల్లో విద్యుత్‌ ఉత్పత్తి కోసం అవసరమైన బొగ్గు కొరత ఇప్పటికీ కొనసాగుతోందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version