మోహన్ బాబుపై ప్రజా సంకల్ప వేదిక వైఎస్ ప్రెసిడెంట్ చెంగల్ రాయులు సంచలన ఆరోపణలు చేశారు. సినీనటుడు మోహన్ బాబు వల్ల నాకు ప్రాణహాని ఉందని బాంబ్ పేల్చాడు ప్రజా సంకల్ప వేదిక వైఎస్ ప్రెసిడెంట్ చెంగల్ రాయులు. వర్శిటి పేరుతో నాలుగు మండలాలోని పలుచోట్లా వాగులు, కుంటలను ఆక్రమించుకున్నాడని ఆగ్రహించారు.
మోహన్ బాబు నాగపట్నం మండంలో వాగు పోరంబోకులో 35 సెంట్లో Stp ప్లాంట్ నిర్మిస్తానని అక్రమంగా అనుమతి పోందారని తెలిపారు ప్రజా సంకల్ప వేదిక వైఎస్ ప్రెసిడెంట్ చెంగల్ రాయులు. ఇప్పుడు అక్కడ అక్రమ నిర్మాణం చేపడుతున్నారని హైకోర్టు లో కేసు వేశానని నాపైనా తప్పుడు కేసులు పెట్టి చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపణలు చేశారు. విద్యానికేతన్ వర్శిటి పేరుతో భూ అక్రమాలు చేస్తున్నారన్నారు. వాటిపై ఒక దళితుడుగా హైకోర్టులో పిల్ వేస్తే…నన్ను బెదిరించారని తెలిపారు ప్రజా సంకల్ప వేదిక వైఎస్ ప్రెసిడెంట్ చెంగల్ రాయులు. ప్రభుత్వం స్పందించి మోహన్ బాబు అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రజా సంకల్ప వేదిక వైఎస్ ప్రెసిడెంట్ చెంగల్ రాయులు..