యాదగిరి గుట్టలో దారుణం.. క్యూలైన్ గ్రిల్‌లో ఇరుక్కున్న బాలుడి తల

-

యాదగిరి గుట్టలో దారుణం చోటుచేసుకుంది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం క్యూ లైన్‌లో ఓ కుటుంబం నిలబడగా ప్రమాదవశాత్తు బాలుడి తల అందులో ఇరుక్కు పోయింది. భక్తులు, తల్లిదండ్రులు గమనించి గ్రిల్ నుండి బాలుడి తలను జాగ్రత్తగా బయటకు తీయడంతో ప్రమాదం తప్పింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

బాలుడి తల అందులో ఇరుక్కుపోయిన సమయంలో బయటకు తీయడానికి తోటి భక్తులు నానా తంటాలు పడ్డారు. పైకి కిందకు జరుపుతూ మొత్తానికి బాలుడి తలను బయటకు తీయడంతో ప్రమాదం తప్పింది. అనంతరం భక్తులు స్వామి వారి దర్శనానికి వెళ్లారు. ఈ ఘటన అనంతరం టెంపుల్ అథారిటీ అధికారులు సైతం పిల్లల రక్షణను పేరెంట్స్ తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సూచనలు చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news