నీ ఇంటికి వచ్చి తాట తీస్తా…ప్రసన్నకుమార్ వంగలపూడి అనిత వార్నింగ్‌

-

తన గురించి అబద్ధపు ప్రచారం చేయడం ఆపకపోతే ఇంటికి వచ్చి తాట తీస్తానని వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డికి తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి టీడీపీ భిక్షతో 3సార్లు ఎమ్మెల్యే అయ్యారు. వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీలో గుర్తింపు కోసం టీడీపిపై విమర్శలు చేస్తున్నారని… ప్రసన్నకుమార్ రెడ్డి చరిత్ర మొత్తం నా దగ్గర ఉందని నిప్పులు చెరిగారు వంగలపూడి అనిత.

ప్రసన్నకుమార్ రెడ్డికి హైదరాబాదులో ఉన్న ఇల్లు ఎవరికి రాసిచ్చారో దమ్ముంటే చెప్పాలని.. నా క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి చరిత్ర మొత్తం మీడియా ముందు ఉంచుతానని హెచ్చరించారు. ప్రసన్న కుమార్ రెడ్డి మాటలకు, బెదిరింపులకు అనిత భయపడదని… చంద్రబాబు సీఎం అవ్వగానే వైసీపీ నేతల ఇళ్ళకు వెళ్లి బడిత పూజ చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా నగరిలో పోటీ చేసి డిపాజిట్ తెచ్చుకోగలరా..? అని సవాల్‌ విసిరారు వంగలపూడి అనిత.

Read more RELATED
Recommended to you

Exit mobile version