President Draupadi Murmu’s visit to AP today: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము…ఏపీ పర్యటన ఖరారు అయింది. నేడు ఏపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. నేడు ఏపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్న నేపథ్యంలోనే… పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉభయ గోదావరి జిల్లాలు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల నుంచి 800 పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు.
14 సెక్టార్లుగా భద్రతను విభజించి ఏర్పాట్లు చేశారు. ఇక ఇందులో భాగంగానే.. ఇవాళ ఉదయం 11.20కి గన్నవరం విమానాశ్రయం చేరుకోనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇక గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా మంగళగిరి ఎయిమ్స్ కు వెళ్లనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ తరుణంలోనే… భారత రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా విద్యార్థులకు బంగారు పతకాలను ప్రదానం చేస్తారు. స్నాతకోత్సవ ప్రసంగం చేయనున్నారు రాష్ట్రపతి ముర్ము. ఇవాళ మొత్తం 49 మంది MBBS విద్యార్థులు, 04 మంది పోస్ట్ డాక్టోరల్ సర్టిఫికేట్ కోర్సు విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి ఎయిర్ పోర్ట్ చేరుకుని ఢిల్లీ వెళ్లనున్నారు.