జగనన్న ఇళ్ల నిర్మాణంలో భారీ కుంభకోణం జరిగిందని ప్రధాని మోడీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. పేదలందరికీ ఇళ్ల పట్టాల పథకం పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ స్కాంకు పాల్పడ్డారని ప్రధానికి లేఖలో పవన్ ఫిర్యాదు చేశారు. పేదలందరికీ భూమి పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని..ఈ స్కీం కింద భారీ ఎత్తున.. రూ. 35,141 కోట్ల మేర భారీ దోపిడీ జరిగిందని లేఖలో వివరించారు.
పేదలందరికీ ఇళ్ల పట్టాలప పేరుతో జరిగిన దోపిడీపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలి….ఈ స్కీం కేంద్ర ప్రభుత్వ పథకాలతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి సీబీఐ, ఈడీలతో విచారణ చేయించాలని ప్రధాని మోడీని కోరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. భూ సేకరణ పేరుతో భారీ భూదందాకు.. భారీ దోపిడీకి వైసీపీ నేతలు తెర లేపారన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణాల్లో జరిగిన అత్యంత భారీ అవినీతిపై దృష్టి సారించాలి…పేదలకు సంబంధించి ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు వ్యయం రూ.1,75,421 కోట్లు అయితే, ప్రభుత్వం మాత్రం రూ.91,503 కోట్లుగా చెబుతోందన్నారు. ఈ అంశంలో అనేక సందేహాలున్నాయని లేఖలో స్పష్టం చేశారు. పథకం పేరుతో వైసీపీ నాయకులు భారీగా లాభపడ్డారని..దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు.