వైజాగ్ రానున్న ప్రధాన మంత్రి మోడీ రానున్నారు. ఇవాళ ఏపీ కేబినెట్ లో మీటింగ్ లో కూడా ప్రధాన మంత్రి మోడీ టూర్ పై చర్చించారట. ఈ సందర్భంగా 14 అంశాల ఎజెండాలకు ఆమోదం తెలిపారు. జనవరి 8న వైజాగ్ రానున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. ప్రధాని మోడీ.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యటన పై క్యాబినెట్ లో చర్చ జరిగింది.
ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ శంకుస్థాపనలు చేయనున్నారు.. ప్రధాని మోడీ పర్యటన కు భారీ ఏర్పాట్లు చేయాలన్న సిఎం చంద్రబాబు…ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారట.
అలాగే అమరావతిలో రూ.2,733 కోట్ల తో చేపట్టనున్న పనులతో పాటు సీఆర్డీఏ 44వ సమావేశం లో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు అంగీకారం తెలిపారు. పిఠాపురం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ లో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులు జారీ చేసే అధికారం మున్సిపాలిటీలకు బదలాయించేలా చట్ట సవరణ కు ఆమోదం తెలిపింది.