సీజనల్ వ్యాధులపై మంత్రి విడదల రజినీ కీలక ఆదేశాలు జారీ చేశారు. విష జ్వరాల హాట్ స్పాట్ లను గుర్తించండని.. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా పంచాయతీరాజ్, మున్సిపల్ విభాగాలతో సమన్వయం చేసుకోండని కోరారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ విషయంలో నిర్లక్ష్యం వద్దని..మలేరియా, డెంగీ కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండండన్నారు.
10వ తేదీ నుంచి ఫీవర్ సర్వే చేపట్టాలని.. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. డెంగీ, మలేరియా కిట్ల కొరత లేకుండా చూసుకోవాలని.. 15 రోజులపాటు ఇంటింటి అవగాహన కార్యక్రమం చేపట్టాలని పేర్కొన్నారు. రక్తం కొరత లేకుండా చర్యలు తీసుకోండని.. మందుల కొరత ఉండటానికి వీల్లేదని.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాలని స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్యం మనందరి బాధ్యత అని.. ఏజెన్సీ ప్రాంతాల్లో మరింత అప్రమత్తత అవసరమన్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని.