సికింద్రబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ప్రారంభం

-

సికింద్రబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ప్రారంభం అయ్యాయి. సికింద్రబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంగరంగ వైభవం ప్రారంభం అయ్యాయి. ఇక ఈ తరుణంలోనే… తెల్లవారు జామున నాలుగు గంటల నుంచి బోనాలు సమర్పించేందుకు క్యూలైన్లో బారులు తీరారు భక్తులు. ఇక ఈ సందర్భంగా అమ్మవారికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలు సమర్పించి ప్రతేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. 200 సంవత్సరాల కిందట నుంచి ఆనవాయితీగా సెంటిమెంట్ గా వస్తున్న జాతర అన్నారు. సికింద్రాబాద్ లో స్థలం చాలా చిన్నగా ఉన్నా లక్షలాదిమంది భక్తులు వచ్చి బోనాలని సమర్పించుకుంటారు చాలా సెంటిమెంట్ గా భావిస్తారని వివరించారు. హైదరాబాద్ మొత్తం కొన్ని వేలలో ఆలయాలు ఉన్నా కూడా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ప్రత్యేకత అన్నారు. ఈరోజు ఉదయం నాలుగు గంటలకి మొదటి పూజ ప్రారంభమైంది రేపు రాత్రి వరకు దర్శనాలు కొనసాగుతూ ఉంటుందని.. ఎక్కడ ఏ రాష్ట్రాలలో కూడా లేని విధంగా ప్రైవేట్ దేవాలయాలకు కేసీఆర్ గారి ఆలోచనలతో ఆర్థిక సహాయం జరుగుతోందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version