ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..అభ్యంతరం లేని భూముల క్రమబద్ధీకరణ చేయనుంది సర్కార్. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ లో భూముల క్రమబద్దీకరణకు సంబంధించి విధి విధానాలు ఖరారు అయ్యాయి. ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కిం 2025 పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. అర్బన్ ఏరియా రూరల్ ఏరియా క్రమబద్ధీకరణకు సంబంధించి నిబంధనలు అమలు చేయనున్నారు.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి నిబంధనలు జారీ చేశారు. ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ కు సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వులన్నిటిని పక్కన పెడుతూ జీవో నెంబర్ 30 జారీ చేసింది ప్రభుత్వం. 2019 అక్టోబర్ 15 తేదీని కట్ ఆఫ్ డేట్ గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ ఇష్యూ చేసింది. ఆ తేదీ కంటే ముందు ఆక్రమిత స్థలాల్లో నివాసం ఉంటేనే క్రమబద్ధీకరణ దరఖాస్తు చేసేందుకు అవకాశం ఉంది. మాస్టర్ ప్లాన్, జోనల్ ప్లాన్ లో నిర్దేశిత స్థలాలు, లే అవుట్ స్థలాలు, కాలువలు, నదీ ప్రవాహ గట్లు, ఇతర జలవనరుల కు సంబంధించిన స్థలాల్లో క్రమబద్ధీకరణ సాధ్యం కాదని స్పష్టం చేసింది.
ఖాళీ స్థలాలు, వాటిలో తాత్కాలిక ఇళ్లు కట్టుకున్నా క్రమబద్ధీకరణ కు అనర్హులని పేర్కొంటూ మార్గదర్శకాలు జారీ చేసింది.మ150 గజాల వరకూ ఉచితంగానే క్రమబద్ధీకరణ చేయనున్నట్టు వెల్లడించింది. 301 గజాల కంటే ఎక్కువ భూమి ఆక్రమణ లో ఉంటే సాధారణ రిజిస్ట్రేషన్ విలువ తో నే క్రమబద్ధీకరణ చేసేందుకు అవకాశం ఉంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా.