హైదరాబాద్ లో ఉన్న మాంసాహారులకు బిగ్ షాక్. హైదరాబాద్ లో చికెన్ షాప్ లతో పాటుగా మటన్ షాపులు కూడా బంద్ చేయాలనీ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు అధికారులు. దీంతో హైదరాబాద్ లో చికెన్ షాప్ లతో పాటుగా మటన్ షాపులు కూడా బంద్ కానున్నాయి. అయితే ఇన్ని రోజులు గాంధీ జయంతి సందర్భగానే ఈ చికెన్ షాపులు, మటన్ షాపులతో పాటుగా వైన్స్ ను బంద్ చేసేవారు. కానీ ఈ సారి గాంధీ వర్ధంతి రోజున కూడా ఈ నియమని పాటించాలని పేర్కొన్నారు.
గొర్రెలు, మేకల మండీలతో పాటుగా దుకాణాలను బంద్ చేయాలనీ.. ఒకవేళ ఎవరైనా ఈ ఆంక్షలను ఉల్లంగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అని పేర్కొన్నారు. అందువల్ల పోలీసులు కూడా ఈ షాపులపైన మండీల పైన నిఘా అనేది ఉంచాలని పేర్కొన్నారు. అయితే గాంధీ గారు అహింస మార్గంలో నడిచేవారు.. అందరూ అందులోనే నడవాలని సూచించే వారు అనేది మనకు తెలిసిందే. అందువల్లే ఆయన జయంతి అలాగే వర్ధంతి రోజునా ఈ రకమైన నిర్ణయాలు అనేవి తీసుకున్నారు అధికారులు.