బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల పొత్తులపై ట్విస్ట్‌ ఇచ్చిన పురంధేశ్వరి !

బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల పొత్తులపై ట్విస్ట్‌ ఇచ్చారు ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి. విజయవాడలోని బిజెపి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర కార్యాలయంలో ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి మాట్లాడుతూ… చంద్రబాబు అరెస్టును మేం ఖండించాం.. మేం అరెస్టుకు వ్యతిరేకం అనే కదా అర్ధం అని తెలిపారు.

పవన్ కళ్యాణ్ తో పొత్తుపై ఆయన కేంద్రంతో మాట్లాడతారని… మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం పై పవన్ తన అభిప్రాయం చెప్పారని వివరించారు. పొత్తులపై మేం మా అధినేత నిర్ణయాన్ని బట్టి చేస్తామన్నారు ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి. హస్తకళల అభివృద్ధి లో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ అందించడం ఈ స్కిం ఉద్దేశమని.. బిజెపి పేదల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ కార్యక్రమాలు చేస్తోందని వివరించారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రతీ పేద వాడికీ 5 లక్షలు అందిస్తుందని… ఆరోగ్యశ్రీ మాత్రమే ఏపీలో అమలులో ఉంది.. ఆయుష్మాన్ భారత్ అమలు చేయడం లేదని ఆగ్రహించారు.