వ్యక్తిగత దూషణలు చేస్తే..నేను బెదరను – దగ్గుబాటి పురంధేశ్వరి

-

వ్యక్తిగత దూషణలు చేస్తే..నేను బెదరనని కొడాలి నానికి కౌంటర్‌ ఇచ్చారు బీజేపీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. ప్రకాశం జిల్లాలో ఇవాళ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ..మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుంది..ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీకి స్పష్టత ఉందన్నారు.

kodali nani slams purandeshwari
kodali nani slams purandeshwari

తొమ్మిదిన్నరేళ్ళలో అనినీతిరహిత పాలన చేసిన మోదీ..దేశంలో ప్రధాని మోదీ సుపరిపాలన అందిస్తుంటే రాష్ట్రంలో అధికార పార్టీ స్వపరిపాలన చేస్తుందని కొనియాడారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో అరాచక, విధ్వంసకర, వినాశకర పాలన సాగిస్తున్నారు..దేవుడి విగ్రహాల నుంచి, గర్బ గుడిలో ఉన్న విగ్రహాలను కూడా ధ్వంసం చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు.

మోదీ అన్నీ కులాలకు న్యాయం చేయాలని పాలన చేస్తుంటే సీఎం జగన్ సామాజిక, సాధికార యాత్రల పేరిట మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు..సామాజిక, సాధికార యాత్రలు చేసే నైతిక హక్కు ఉందా..అని ప్రశ్నించారు. టీటీడీలో అన్యమతస్తులను చైర్మన్లుగా నియమిస్తున్నారు..టీటీడీ హుండీ మీద వచ్చిన ఒక శాతం ఆదాయాన్ని దారి మళ్ళించే ప్రయత్నం చేశారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news