దిల్లీ లిక్కర్ స్కామ్.. అభిషేక్ బోయినపల్లి పిటిషన్లపై సుప్రీం విచారణ

-

దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఈ కేసులో ప్రముఖులు అరెస్ట్ అయి ఈడీ విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మరి కొందరు ఈడీ నోటీసులతో తరచూ ఈడీ కార్యాలయాలకు పరుగు తీస్తున్నారు. ఈ వ్యవహారంతో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ బోయినపల్లి తన అరెస్టు చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఇవాళ సుప్రీం విచారణ చేపట్టింది.

పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టివేయడంతో అభిషేక్సు ప్రీంను ఆశ్రయించారు. పీఎంఎల్‌ఏ సెక్షన్ 19 పరిగణనలోకి తీసుకోకుండా అభిషేక్​ను అరెస్టు చేశారని ఆయన తరఫు లాయర్లు సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. సీబీఐ కేసులో బెయిల్ వచ్చాక ఈడీ కేసులో అరెస్టు చేశారని తెలిపారు. మరోవైపు అభిషేక్ బోయినపల్లి బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ఈడీ అధికారులు సర్వోన్నత న్యాయస్థానంలో అప్లికేషన్ వేశారు. ఈ క్రమంలో అభిషేక్ బోయినపల్లి లేవనెత్తిన అంశాలపై కౌంటర్ దాఖలుకు ఈడీకి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. 5 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది. ఈడీ కౌంటర్‌కు రిప్లై దాఖలుకు అభిషేక్ న్యాయవాదులను ఆదేశిస్తూ.. విచారణను డిసెంబర్ 4కు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news