ల్యాండ్ టైటిలింగ్ ఇంకా మంచిదేనని జగన్‌ చెప్పడం దారుణం – పీవీ రమేష్

-

ల్యాండ్ టైటలింగ్ ఇంకా మంచిదేనని జగన్‌ చెప్పడం దారుణం అంటూ మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దుపై మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ మరో ట్వీట్ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదే అంటూ ఎమ్మెల్సీలు, ఎంపీలకు మాజీ సీఎం జగన్ ఇంకా చెబుతుండడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

pv ramesh on land tittling act

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు అవసరమే ఉండదని.. నిజానికి నీతి అయోగ్ సలహా మండలి సెక్యూర్ టైటిల్ లేని భూముల విషయంలో ఈ విధానాన్ని అమలు చేయాలని సూచించిందని వివరించారు. 200 సంవత్సరాల ముందు బ్రిటిష్ మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమైన ఆంధ్రప్రదేశ్ కు రైత్వరి సెటిల్మెంట్ అప్పుడే జరిగిందని… అవసరం లేని చోట అవగాహన లోపంతో గత సర్కార్ ఈ చట్టాన్ని తెచ్చిందని పేర్కొన్నారు. అందుకే ఈ చట్టం ద్వారా సామాన్య రైతులు కూడా ఇబ్బందులు పడతారని చెప్పానని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news