దుర్మార్గుడిని ఎదుర్కోవడం కష్టమని, ప్రభుత్వాధినేతే దుర్మార్గుడైతే అతన్ని ఎదుర్కోవడం చాలా… చాలా కష్టం అని రఘురామకృష్ణ రాజు అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోగలిగిన మేరు నగధీరుడు, చెప్పాలంటే ఒక్క మగాడు… పద్మ విభూషణ్ చెరుకూరి రామోజీరావు గారు అని అన్నారు. ఈ వయసులోనూ దుర్మార్గులను ఒంటి చేత్తో ఎదుర్కొంటూ ఆయన చేస్తున్న పోరాటానికి హ్యాట్సాఫ్ అని, మీ వయసుతో పోలిస్తే యువకులమైన నావంటి వారందరికీ ఆయన పోరాటం స్ఫూర్తిదాయకం అని అన్నారు.
గతంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై పోరాడిన స్వతంత్ర సమరయోధులతో సమానం మీ పోరాట స్ఫూర్తి అని, ప్రస్తుత పాలకులతో పోల్చి చూస్తే, బ్రిటిష్ వాళ్లు పాపం చాలా మంచి వాళ్ళు అని, ప్రస్తుత పాలకులు దరిద్రులని, ఇటువంటి దుష్టులపై పోరాడుతున్న మీ పోరాటానికి ప్రజలందరి మద్దతు ఉందని, ఈ పోరాటంలో విజయం ఆయనదేనని, నిజాలను చెబుతున్న ఆయన వెంటే రాష్ట్ర ప్రజలంతా ఉన్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను వీడి ఆరు లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలలో చేరినట్లుగా ఈనాడు దినపత్రిక రాసిన కథనానికి సరైన సమాధానం చెప్పుకోలేని ప్రభుత్వ పెద్దలు, సాక్షి దిన పత్రికలో రామోజీ క్షుద్ర రాతలని ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని తెలిపారు.
పాఠశాలలు ప్రారంభమైన తరువాత కూడా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరుతారని రాయించుకోవడం సిగ్గుచేటు అని, ప్రైవేటు పాఠశాలలలో చేరిన విద్యార్థులు తిరిగి ప్రభుత్వ పాఠశాలలో చేరుతారా? అంటూ రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు. మార్గదర్శిపై కేసు విచారణ తెలంగాణ హైకోర్టులో కాకుండా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిందని, మార్గదర్శి సంస్థ అధినేత రామోజీరావు గారు హైదరాబాదులో నివాసం ఉంటున్నారని, అలాగే ఆ సంస్థ ప్రధాన కార్యాలయం హైదరాబాదులోనే ఉందని, అయినా కక్ష కార్పన్యంతో మార్గదర్శిపై ఏడు కేసులు నమోదు చేసి, రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టును ఆశ్రయించి కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరడం విస్మయాన్ని కలిగిస్తోందన్నారు