అండగా ఉన్నవారికి న్యాయం..ఇదే జగన్ అంటే.!

-

జగన్ అంటే మాట తప్పరు…మడమ తిప్పరు..ఈ విషయంలో జగన్ ఎప్పుడు ముందే ఉంటారు. అది ఏ విషయమైన సరే..ఇక పార్టీ విషయంలో..ఎప్పుడు పార్టీ కోసం పనిచేస్తూ అండగా ఉండేవారికి జగన్ న్యాయం చేయడంలో ముందు ఉంటారు. చంద్రబాబు మాదిరిగా నాయకులని వాడుకుని వదిలేయరు. ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తారు. అదే జగన్ నైజం.

అయితే గత ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అన్నీ వర్గాలకు న్యాయం చేస్తూనే..పార్టీకి అండగా నిలబడిన వారికి కీలక పదవులు ఇస్తూ వచ్చారు. ఇక మొదట్లో తన కోసం కాంగ్రెస్ లో పదవులు సైతం వచ్చిన వారికి వైసీపీలో మంత్రి పదవులు ఇచ్చారు. ఇంకా చాలామంది నేతలకు అనేక పదవులు ఇచ్చారు. అలాగే గత ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం సీటు త్యాగం చేసిన వారికి ఎమ్మెల్సీలు ఇచ్చారు. ఉదాహరణకు మర్రి రాజశేఖర్, జంగా కృష్ణమూర్తి..ఇలాంటి వారు చాలామంది ఉన్నారు.

తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన కోలా గురువులుకు విశాఖ డి‌సి‌సి‌బి ఛైర్మన్ పదవి ఇచ్చారు. ఇటు ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్న తాతినేని పద్మావతికి కృష్ణా డి‌సి‌సి‌బి పదవి ఇచ్చారు. అలాగే ప్రకాశం డిసిసిబి చైర్మన్ గా వై.ప్రసాద్ రెడ్డిని పెట్టారు. ఇక  కర్నూల్ సిటీ సీటు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి భార్య ఎస్వీ విజయ మనోహరిని కర్నూలు డి‌సి‌సి‌బి చైర్‌పర్సన్ గా నియమించారు.

అలాగే గురజాల సీటు త్యాగం చేసిన జంగా కృష్ణమూర్తికి ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చారు..ఇప్పుడు టి‌టి‌డి ఛైర్మన్ పదవి ఇస్తున్నారని తెలిసింది. వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ముగుస్తుండటంతో జంగాని నియమిస్తారని తెలిసింది. ఇలా పార్టీ కోసం అండగా నిలబడే వారికి జగన్ ఎప్పుడు న్యాయం చేస్తూనే ఉంటారు. అందుకే నాయకులంతా జగన్ పై అంత అభిమానం చూపిస్తారు. ప్రతిపక్షాలు ఏమైనా విమర్శలు చేస్తే తట్టుకోలేరు.

Read more RELATED
Recommended to you

Latest news