సీఎం జగన్ కాదు.. అప్పుల జగన్నాథం – రఘురామ

-

వచ్చే ఏడాది మార్చి వరకు కేవలం ఐదు వేల కోట్ల రూపాయల రుణంతోనే అప్పుల జగన్నాథం గారు బండిని నడిపించగలరా?, అని నిలదీశారు  నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు.   కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి 30,2,75 కోట్ల రూపాయల రుణ వెసులుబాటు బాటు కల్పించిందని అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరువు అరుపులు అరుస్తూ 6 వేల కోట్ల రూపాయల అప్పులను లాగేసిందని వెల్లడించారు.

రానున్న మంగళవారం మరో 3500 కోట్ల రూపాయల అప్పును ఎత్తేందుకు సిద్ధమయిందని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కల్పించిన రుణ వెసులుబాటులో నుంచి పాత బకాయిల కింద 16 వేల కోట్ల రూపాయల కోత విధించారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం 70 వేల కోట్ల రుణ వెసులుబాటు లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిందని, ప్రతి ఏడాది ఏప్రిల్ లో ఆర్టికల్ 293 (3) ప్రకారం జి ఎస్ డి పి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రుణ వెసులుబాటును నిర్దేశిస్తుందని తెలిపారు. తమ జి ఎస్ డి పి అధికంగా ఉందని దొంగ లెక్కలను చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన బృందం నిష్ణాతులని, రాష్ట్ర జిఎస్ డీ పీ 14 లక్షల 50 వేల కోట్ల రూపాయలుగా ప్రకటించారని, జి ఎస్ డి పీ లో ప్రతి రాష్ట్రానికి మూడున్నర శాతం మొత్తం రుణ వెసులుబాటు లభిస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version