పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు కాదు…చంద్రబాబు సొంత కొడుకు – వైసీపీ ఎంపీ

-

ఇన్నాళ్లు తెలుగుదేశం పార్టీ, జనసేన వేరువేరుగా పోటీ చేస్తాయని, మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పుకున్న తన ప్రస్తుత పార్టీ నాయకుల ఆశలన్నీ తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు అధికారికంగా ఖరారు కావడంతో ఆవిరైపోయాయని చురకలు అంటించారు రఘురామకృష్ణ రాజు. పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడని సంబోధించడం ఇక మానండి అని జగన్ మోహన్ రెడ్డి గారికి సలహా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు కాదని, సొంత పుత్రుడేనని, కంటేనే కొడుకు కాదని, కనిపెట్టుకొని ఉండేవాడు కూడా కొడుకేనని అన్నారు.

తన వయసు కొంచెం ఎక్కువ కాబట్టి… తాను చంద్రబాబు నాయుడు గారికి తమ్ముడిని అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కొడుకు లైతే, తాను తమ్ముడిని అని రఘురామకృష్ణ రాజు గారు వెల్లడించారు. ఎన్డీఏ కూటమిలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు భాగస్వామి అని, జనసేన, టీడీపీ పొత్తు వల్ల, టీడీపీ కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కిందే లెక్క అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ పై బీజేపీ అగ్ర నాయకులు కిషన్ రెడ్డి గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, బండి సంజయ్ గారి వంటి వారు స్పందించారని, బీజేపీ తరపున ఎవరు మాట్లాడినా మాట్లాడినట్టేనని, ప్రధానమంత్రి మోడీ గారే మాట్లాడాలన్నా నిబంధన ఏదీ లేదని అన్నారు రఘురామకృష్ణ రాజు. ఎన్డీఏ భాగస్వామిగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకత్వం ఈసారి తాము ఆంధ్రాలో పోటీచేయం అని, కూటమి తరుపున నువ్వు పోటీ చెయి అని అంటే… ఎన్నికల్లో నెగ్గిన తర్వాత అవన్నీ ఎన్డీఏ కూటమి స్థానాలే అవుతాయని పేర్కొన్నారు రఘురామకృష్ణ రాజు.

Read more RELATED
Recommended to you

Exit mobile version