జగన్ వల్ల టీటీడీ భక్తుల మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయి – రఘురామ

-

టీటీడీ స్టేషనరీపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఫోటో ముద్రించడం వల్ల భక్తుల మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయని రఘురామకృష్ణ రాజు అన్నారు. ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన ఫోటోను ముద్రించమని ఎవరైనా చెప్పారా? అన్న అనుమాన్ని వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు, ఈవో ధర్మారెడ్డి గారు తెలిసి తెలిసి ఇటువంటి పొరపాటు చేయరని తాను భావిస్తున్నానని తెలిపారు.

Jagan successfully failed MP Raghurama Krishnam Raju's plan
raghurama on cm jagan birthday

ఈ సంఘటన ఆయన మనసును తీవ్రంగా కలచివేసిందని, భక్తులకు ఆ ఫోటో అంటేనే తీవ్రమైన వ్యతిరేకతను కల్పించే పరిస్థితిని తీసుకు వస్తున్నారని అన్నారు. రాజకీయ సుడిగుండంలో కడతేర్చే దిశగా ప్రజలని ప్రేరేపిస్తున్నారేమోనని, ఒక్కసారి ఇటువంటి సంఘటనలపై పునరాలోచించాలని రఘురామకృష్ణ రాజు గారు సూచించారు.

ఎన్నికల అఫిడవిట్లో జగన్ మోహన్ రెడ్డి గారు తాను క్రైస్తవ మతస్థుడినని తెలిపారని, ఆయన ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతుందని అన్నారు. తిరుమల శ్రీవారిని అన్యమతస్తులు ఎవరైనా దర్శించుకోవాలని భావించినప్పుడు… తాను అన్యమతస్తుడనని, భగవంతుడిపై నమ్మకంతో ఆయనని దర్శించుకుంటానని డిక్లరేషన్ ఇవ్వవలసి ఉంటుందని, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా ఈ విధంగా డిక్లరేషన్ ఇచ్చారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news