వైసీపీ బస్సు యాత్ర కాస్తా తుస్సు యాత్రగా మారింది – రఘురామ

-

దొంగ ఓట్లపైనే జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆధారపడి ఉందని, ప్రజలు తమకు ఓట్లు వేస్తారనే నమ్మకం తమ పార్టీ నాయకత్వానికి లేదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. బస్సు యాత్ర కాస్తా తుస్సు యాత్రగా మారినట్లు అర్థమయిందని, సాక్షి దినపత్రిక చదివిన వారికి మాత్రం, బస్సు యాత్రకు విపరీతంగా జనం వస్తున్నట్లుగా గ్రాఫిక్స్ ఫోటోల ద్వారా భ్రమ కల్పిస్తున్నారన్నారని అన్నారు. బస్సు యాత్రలో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయని, జనం ఎక్కడ కూడా కనిపించడం లేదన్నారని అన్నారు.

Jagan successfully failed MP Raghurama Krishnam Raju's plan
raghurama ycp bus yatra

దొంగ ఓట్ల నమోదుపై రాజీ పడేదే లేదన్నట్లుగా తమ పార్టీ నేతలు ఒక నిర్ణయానికి వచ్చారని, ఇదే విషయంపై సిటిజన్స్ ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు న్యాయస్థానంలో కేసు వేశారని, అయినా తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తుండడం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ప్రతి నియోజకవర్గంలోను ఒక్కొక్కరి పేరిట రెండు నుంచి నాలుగు వరకు దొంగ ఓట్లను నమోదు చేశారని, ఇలా నమోదు చేసినవే ప్రతి నియోజకవర్గంలో 50 వేల పైచిలుకు ఓట్లు ఉంటాయని తేలిందని అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news