జగన్ కేసుల బదిలీ పై రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఈ కేసు తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. రఘురామ కృష్ణం రాజు పిటిషన్ పై అఫిడవిట్ దాఖలు చేసింది సిబిఐ. ఈ సందర్భంగా వాదనలకు సమయం కోరింది సిబిఐ. దాంతో వచ్చే సోమవారానికి కేసు విచారణ వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. రఘురామకృష్ణంరాజు పిటిషన్ పై జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మల ధర్మాసనం విచారణ జరిపారు.
గత పదేళ్ళుగా జగన్ పై ఉన్న సీబిఐ కేసులో ట్రయల్ జరగట్లేదు అని RRR తరపు వాదనలు వినిపించారు. ఎన్నోసార్లు విచారణ జరిగిన కేసు ముందుకు పోవట్లేదని… తనను అవమానించారని RRR తరపు వాదనను సుప్రీం కోర్టుకు వినిపించారు. పుట్టిన రోజున కిడ్నాప్ చేసి, దాడి చేశారని… RRR తరపు వాదన వినిపించారు. జగన్ తరఫున వాదన వినిపించారు ముఖుల్ రోహిత్గి. ఇది రాజకీయ కారణాలతో పెట్టిన కేసు అని తెలిపారు ముఖుల్ రోహిత్గి. ఇప్పటికే ఈ కేసు కేసును హైకోర్టు పర్యవేక్షిస్తుంన్నారు ముఖుల్ రోహిత్గి. దీంతో ఈ కేసు తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది సుప్రీం కోర్టు.