కమ్మవారు ఓట్లు వేస్తేనే గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా అయ్యారా ? అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు రఘురామకృష్ణ రాజు. జగన్ మోహన్ రెడ్డికి కేవలం రెడ్లు ఓట్లు వేస్తే మాత్రమే ఆయన గెలిచారా?, కమ్మవారు ఓట్లు వేసినంతమాత్రానే చంద్రబాబు అన్ని సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారా? అంటూ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కేవలం ఒక కులానికి చెందిన నాయకుడు కాదని, పరిణితి చెందిన ప్రజా నాయకుడని పేర్కొన్నారు.
ఆయన్ని ఒక కుల నాయకుడిగా మార్చవద్దని, ఒక గొప్ప నాయకుడిగా గౌరవించాలని కోరారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నోసార్లు మాట్లాడుతూ ఇదే విషయాన్ని చెప్పారని గుర్తు చేశారు. కులం అవసరమే కానీ సంకుచిత స్వభావంతో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని అభిమానించి, ప్రేమించి, దేవుడిగా గౌరవించే ఇతర కులాల వారి మనోభావాలను దెబ్బతీయవొద్దని రఘురామకృష్ణ రాజు గారు కోరారు.
నేను కాపును కాను క్షత్రియుడిని… అయినా పవన్ కళ్యాణ్ అభిమానిని… నాలాగే 125 బిసి కులాలలో, 45 దళిత కులాలలో, ఏడు నుంచి 8 ఇతర కులాలకు చెందిన వారిలోనూ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారన్నారు. ఎన్నికల్లో పొత్తుల కోసం టీడీపీ, జనసేన కలయిక అవసరమన్న రఘురామకృష్ణ రాజు గారు ఈ రెండు పార్టీలు నెగ్గడం అనేది చారిత్రాత్మక అవసరమని పేర్కొన్నారు.