Shruthi Haasan : చీరకట్టులో శ్రుతి హాసన్ మెస్మరైజింగ్ ఫొటోషూట్

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్‌ మరోసారి తన ఫొటోషూట్ తో అభిమానులను మాయ చేసింది. ఈసారి ట్రెడిషనల్ లుక్ లో తన అందంతో మెస్మరైజ్ చేసింది. గోల్డ్ అండ్ సిల్వర్ పట్టుచీరలో కొప్పులో మల్లెపూలు, నుదుట బొట్టు పెట్టుకుని అచ్చతెలుగు బాపుబొమ్మలా కనిపించింది. ఈ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ బ్యూటీ తన ఫొటోలు షేర్ చేసిన క్షణాల్లోనే లక్షల వ్యూస్, లైక్స్ వచ్చేశాయి. యాపిల్ బ్యూటీ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సో బ్యూటీఫుల్ శ్రుతి అంటూ హార్ట్ ఎమోజీస్ పోస్టు చేస్తున్నారు. గార్జియస్, బ్యూటిఫుల్, ఔట్ స్టాండింగ్ బ్యూటీ, లవ్ యు ఫరేవర్ అంటూ ప్రేమతో కూడిన కాంప్లిమెంట్స్ చేస్తున్నారు. ఇక శ్రుతి ఇటీవలే సలార్ సినిమాతో మన ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఆద్య క్యారెక్టర్ లో మెరిసింది. మరోవైపు అడివి శేష్ తో ఈ భామ ఓ సినిమలో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news