పెళ్లి పీటలెక్కిన మరో టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోలు వైరల్

-

ఇటీవలే టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీ భగ్నానీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో బ్యూటీ పెళ్లి పీటలెక్కింది. ఇండస్ట్రీలో సెలబ్రిటీలంతా వరుసగా బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెబుతున్నారు. టాలీవుడ్ భామ అక్ష పార్థసాని బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కౌశల్ ను తాజాగా వివాహమాడింది.

కొంతకాలం పాటు డేటింగ్ కొనసాగించిన ఈ జంట తాజాగా పెళ్లి పీటలెక్కింది. గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇరు కుటుంబాలు, దగ్గర సన్నిహితులు, స్నేహితులు సమక్షంలో ఈ పెళ్లి ఎంతో సింపుల్గా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను అక్ష, కౌశల్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. నెటిజన్లు, అభిమానులు వారికి పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక అక్ష పార్ధసాని. తెలుగులో యువత, రైడ్, కందిరీగ, బెంగాల్ టైగర్, శత్రువు, రాధా, డిక్టేటర్ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. 2017 తర్వాత నుంచి ఆమెకు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్కు చెక్కేసింది. హైదరాబాద్ నుంచి ముంబయికి మకాం మార్చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news