ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్. స్కూలు విద్యార్థులకు రేపటి నుంచి రాగిజావా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటంతో ఈనెల 10న ప్రారంభించాల్సిన కార్యక్రమం వాయిదా పడగా కోడ్ ముగియడంతో రేపు ప్రారంభించనుంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 38 లక్షల మంది విద్యార్థులకు వారానికి మూడు రోజులు రాగిజావా, మరో మూడు రోజులు చిక్కి అందిస్తారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం స్కూళ్లలోనే గ్లాసులు అందుబాటులో ఉంచనుంది.