చంద్రబాబును కలవకపోవడానికి కారణం ఏంటో చెప్పిన రజినీకాంత్..!

-

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్ చంద్రబాబు నాయుడుతో ములాఖత్ అవుతారనే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. తాజాగా వాటిపై రజినీకాంత్ స్పందించారు. చంద్రబాబును తాను కలవాలని అనుకున్నానని.. కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్ వల్ల వెళ్లలేకపోయానని చెప్పుకొచ్చారు.

కుటుంబ వేడుకల్లో పాల్గొనేందుకు రజినీకాంత్ చెన్నై నుంచి కోయంబత్తూరు బయలుదేరారు. ఈ నేపథ్యంలోనే చెన్నై చేరుకోగానే.. చంద్రబాబుతో ములాఖత్ గురించి మీడియా ప్రశ్నించింది. దీనిపై రజినీకాంత్ సమాధానం చెప్పారు. చంద్రబాబు, రజినీకాంత్ ల మధ్య మంచి స్నేహం ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కి రజినీకాంత్ కి కొద్ది రోజుల కిందట ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. తన ఆత్మీయ మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు అని పేర్కొన్నారు. చంద్రబాబు ఎప్పుడూ తప్పు చేయరు.. చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తనకు రక్ష అన్నారు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చంద్రబాబును ఏమి చేయలేవని అన్నారు రజినీకాంత్.

Read more RELATED
Recommended to you

Latest news