BJP: బీజేపీ అధ్యక్ష రేసులో రామ్ మాధవ్ పేరు!

-

Ram Madhav: జాతీయ బిజెపి అధ్యక్ష రేసులో కొత్త పేరు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. జాతీయ భారతీయ జనతా పార్టీ రేసులో రామ్ మాధవ్ పేరు తెరపైకి వచ్చింది. కోనసీమ జిల్లా అమలాపురానికి సంబంధించిన వారణాసి రామ్ మాధవ్ పేరు మరోసారి జాతీయ రాజకీయాల్లో మారుమోగుతోంది. బిజెపి జాతీయ అధ్యక్షుడు రేసులో… రామ్ మాధవ్… పేరు వినిపిస్తోంది.

Ram Madhav’s name in the race for AP BJP president

ఈ రేసులో రామ్ మాధవ్ మొదటి వరుసలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈసారి రామ్ మాధవ్ కు పట్టం కట్టాలంటూ ఆర్ఎస్ఎస్ గట్టిగా పట్టుపడుతుందని చెబుతున్నారు. అమలాపురంలో పుట్టి పెరిగిన ఆయన ఆర్ఎస్ఎస్ లో అంచలంచలుగా జాతీయస్థాయికి ఎదిగారు. దక్షిణాది రాజకీయాలపై రామ్ మాధవ్ కు మంచి పట్టు ఉంది. అంతేకాదు దక్షిణాది నాయకుడికి అధ్యక్ష పదవి ఇస్తే… దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పుంజుకోవచ్చని బిజెపి ప్లాన్ వేస్తోందట. అందుకే రామ్ మాధవ్ పేరు వినిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news