BREAKING : ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డికి హరి రామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి పై ఉన్న కేసులు సిబిఐ కోర్టులో ఇంకా విచారణలో ఉన్నాయని ఈ లేఖలో పేర్కొన్నారు హరి రామ జోగయ్య.

కోర్టులు ఏ కారణం చేతైనా మిమ్మలను దోషులుగా ప్రకటిస్తే.. సీయం పదవికి రాజీనామా చేయవలసి వస్తే మీ వారసులుగా రెడ్డి కులస్తులను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారా..అని ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిని హరి రామ జోగయ్య నిలదీశారు. లేక కాపు బడుగు బలహీన వర్గాల వారిని వారసులుగా ప్రకటిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. దీని ద్వారా బడుగు బలహీన వర్గాలపై మీకున్న కమిట్మెంట్ను చూసి గర్వపడతామని లేఖలో ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు హరి రామ జోగయ్య.