నారా లోకేష్ పై మాచర్ల వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. లోకేష్ నువ్వు మగాడైతే, నువ్వు చంద్రబాబుకే పుట్టి ఉంటే నాపై చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీడియాతో మాచర్ల వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి మాట్లాడారు. నారా లోకేష్.. నువ్వు చంద్రబాబు నాయుడికి నిజంగా పుట్టి ఉంటే నాపై ఆరోపణలు రుజువు చేయాలని సవాల్ చేశారు. నేను వెయ్యి కోట్ల అవినీతి చేసి ఉంటే నిరూపించు.
నన్ను ఏదో చేయాలి అనుకున్న మీ అయ్య వల్లే కాలేదు.. నీ వల్ల ఏమౌతుంది. లోకేష్ నీవు పప్పు కాదు.. వెర్రి పుష్పానివి అంటూ రెచ్చిపోయారు. నారా లోకేష్.. నిన్ను త్వరలో ఎర్రగడ్డ పిచ్చి ఆస్పత్రిలో జాయిన్ చేస్తారని వార్నింగ్ ఇచ్చారు. పెద్దిరెడ్డి రాజకీయ అనుభవం అంత లేదు నీ జీవితం. నువ్వా పెద్దిరెడ్డిని విమర్శించేదన్నారు. వార్డు నెంబర్‌గా కూడా గెలవలేని లోకేష్ నువ్వు ఐపీఎస్ ఆఫీసర్లను విమర్శిస్తావా. వచ్చే ఎన్నికల్లో నిన్ను వార్డు మెంబర్‌గా కూడా గెలవనీయం అంటూ ఫైర్ అయ్యారు. పల్నాడు జిల్లాలో ఏడుకు ఏడు నియోజకవర్గాలు గెలుస్తాం. క్రిమినల్స్‌ను పక్కన పెట్టుకుని వారిచ్చిన స్క్రిప్ట్ లోకేష్ చదువుతున్నాడని తెలిపారు.
లోకేష్ నువ్వు మగాడైతే, నువ్వు చంద్రబాబుకే పుట్టి ఉంటే నాపై చేసిన ఆరోపణలు నిరూపించాలి
లోకేష్.. నువ్వు చంద్రబాబు నాయుడికి నిజంగా పుట్టి ఉంటే నాపై ఆరోపణలు రుజువు చేయాలి. నేను వెయ్యి కోట్ల అవినీతి చేసి ఉంటే నిరూపించు. నన్ను ఏదో చేయాలి అనుకున్న మీ అయ్య వల్లే కాలేదు.. నీ వల్ల… pic.twitter.com/IZeGG2hxQg
— Telugu Scribe (@TeluguScribe) August 8, 2023