‘నేషనల్‌ డే ఆఫ్‌ సెలబ్రేషన్‌’గా ఆగస్టు 15.. అమెరికా చట్టసభలో తీర్మానం

-

భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని అమెరికాలో కూడా ప్రత్యేకంగా నిర్వహించుకొనేలా ఓ తీర్మానాన్ని కాంగ్రెస్‌ సభ్యుడు శ్రీ తానేదార్‌ ప్రవేశపెట్టారు. ఆగస్టు 15ను అమెరికాలో ‘నేషనల్‌ డే ఆఫ్‌ సెలబ్రేషన్‌’గా ప్రకటించాలని ఆయన తీర్మానంలో కోరారు. ఈ తీర్మానానికి కాంగ్రెస్‌ సభ్యులు బడ్డీ కార్టర్‌, బ్రాడ్‌ షర్మాన్‌ సహ ప్రాయోజకులుగా వ్యవహరించారు. ఆ రోజును ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్యాల్లో సంబురాల దినోత్సవంగా మార్చాలని విజ్ఞప్తి చేశారు.

ఇరుదేశాలు పంచుకొనే ప్రజాస్వామ్య విలువలే బంధానికి, భాగస్వామ్యానికి మూలమని అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు పేర్కొన్నారు. జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ తీర్మానానికి బీజం పడినట్లు తెలిసింది. అధికార దేశ పర్యటనతో ఇరుదేశాల మధ్య విశ్వాసం, పరస్పర అవగాహన, చట్ట పాలన, మానవహక్కులను గౌరవించడం వంటి అంశాలపై అవగాహన పెరిగిందని తీర్మానంలో వెల్లడించారు. భారతీయులతో కలిసి ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టడానికి తీర్మానం ఉపయోగపడుతుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news