తిరుమల లడ్డూ వివాదంపై రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రోజులుగా తిరుమల క్షేత్రం పై వస్తూన్న వార్తలు చాలా బాధకరమన్నారు మాజీ ప్రధాన అర్చకులు రమణ ధీక్షితులు. వేల సంవత్సరాలుగా వైఖానస ఆగమం మేరకు కైంకర్యాలు జరుగుతున్న శ్రీవారి ఆలయంలో ఇలాంటి ఘటనలు జరగడం చాలా దారుమని పేర్కొన్నారు. స్వామివారికి సమర్పించే ప్రసాదాల్లో కల్తి జరగడం చాలా పాపమన్నారు. ప్రసాదాల నాణ్యత, పరిణామాలు సరిగా లేవని అప్పటి ఇఓ, చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేదని తెలిపారు.
గత ఐదు సంవత్సరాలుగా నేను ఒంటరి పోరాటం చేసాను….నా తోటి అర్చకులు సహకరించలేదని వివరించారు. తిరుమలలో ప్రక్షాలన చేస్తామని సియం చంద్రబాబు ప్రకటన చేసి,అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. స్వచ్చమైన నెయ్యిని కర్నాటక డైరి నుంచి సేకరణ చెయ్యాలని టిటిడి నిర్ణయించడం మంచి పరిణామమని వివరించారు మాజీ ప్రధాన అర్చకులు రమణ ధీక్షితులు. గత ప్రభుత్వ హయంలో నా పై కక్ష్య గట్టి అనేక ఇబ్బందులకు గురి చేసారు….వాటిని చంద్రబాబు సరిదిద్ది నాకు న్యాయం చేయాలన్నారు.