మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులుగా ఉన్నవారంతా వరుసగా చని పోతున్నారు. వివేకానందరెడ్డి ఇంట్లో వాచ్ మెన్ గా ఉన్న రంగన్న కడప రిమ్స్ మృతి చెందిన విషయం తెలిసిందే. అంతకు ముందు ముగ్గురు సాక్షులు శ్రీనివాసులు రెడ్డి, గంగాధర్ రెడ్డి, అభిషేక్ రెడ్డి మరణించారు. వరుసగా సాక్షులు చనిపోతుండడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ ఘటనల పై సీఎం చంద్రబాబు తాజాగా మాట్లాడారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న మృతి ముమ్మాటికి అనుమానాస్పదమేనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీ అనంతరం దీనిపై చర్చించారు. రంగన్న మృతి వెనుక ఉన్న అనుమానాలను డీజీపీ మంత్రులకు వివరించారు. వైఎస్ జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా
ఉండాలని పదేపదే చెబుతూ వస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. పరిటాల రవి హత్య కేసులో
సాక్షులు కూడా ఇలానే చనిపోతూ వచ్చారని ఆయన గుర్తు చేశారు.