ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లో బీఎడ్ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే పేపర్ లీక్ అయినట్లు
ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో మంత్రి నారా లోకేశ్ స్పందించారు. పేపర్ లీక్ అంశంపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని చెప్పారు. వెంటనే విచారణ జరపాల్సిందిగా అధికారులను ఆదేశించామని లోకేశ్ తెలిపారు. అంతేకాదు పరీక్ష రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఇలాంటి సంఘటనలను ఉపేక్షించేది లేదని.. దీనికి బాధ్యులు అయిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఎగ్జామ్ కి అరగంట ముందు లీక్ అవ్వడం దారుణం అని పేర్కొన్నారు. కొందరూ ఇది కావాలనే చేసినట్టు అర్థమవుతుందని.. నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటివి పునరావృతం కావొద్దని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు నారా లోకేష్.