Cyclone Michaung : ఏపీలో 9 జిల్లాలకు రెడ్ అలర్ట్

-

Cyclone Michaung : మిచౌంగ్ తుఫాన్ ప్రభావం ఏపీపై స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఏపీలో 9 జిల్లాలకు జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ ,ప.గో., ఏలూరు, కోనసీమ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

Red alert for 9 districts in AP

ఏపీలో మరో ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నెల్లూరు, కడప, తూ.గో., కాకినాడ, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది సర్కార్‌. ఏపీలో మరో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, అనకాపల్లి, మన్యం,విశాఖ, విజయనగరం, శ్రీకాకుళానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది సర్కార్‌.

ఇక అటు మిచౌంగ్ తుఫాను కారణంగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో స్కూళ్లకు ఇవాళ కూడా సెలవు ఉండనుంది. కృష్ణ, ఎన్టీఆర్, నెల్లూరు, తిరుపతి, శ్రీకాకుళం, ప్రకాశం, గుంటూరు, విశాఖపట్నం, వైయస్సార్, అన్నమయ్య జిల్లాల్లో విద్యాసంస్థలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. తుఫాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version