ఏపీ ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

-

ఏపీ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్. తాజాగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం.. ఏపీ ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ ను విడుదల చేసింది. ఏప్రిల్‌ 2 వ తేదీ నుంచే ఏపీ ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటన చేశారు.

ఏప్రిల్‌ 2వ తేదీన తెలుగు, 4 వ తేదీన ఇంగ్లీష్‌, 5న గణితం, పరీక్షలు జరుగనుండగా.. 7 వ తేదీన సైన్స్‌, 9 వ తేదీన సోషల్‌ పరీక్షలు జరుగనున్నట్లు ఆయన ప్రకటన చేశారు. కరోనా నియమ నిబంధనలు పాటిస్తూనే ఏపీ ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలను నిర్వహిస్తామని చెప్పారు.

ఇది ఇలా ఉండగా… ఏపీ ఇంటర్‌ పరీక్షల తేదీలు కూడా ఇటీవలే విడుదల అయిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ మాసం 22 వ తేదీ నుంచి.. మే 12 వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు జరుగనున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని.. పరీక్షలకు సన్నద్ధం కావాలని ఏపీ ప్రభుత్వం చెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version