తిరుమలలో విశాంత్రి భవనాల పేర్లపై కీలక నిర్ణయం తీసుకుంది టిటిడి పాలక మండలి. తిరుమలలో విశాంత్రి భవనాల పేర్లు మార్పు ప్రారంభం అయింది. తిరుమలలో వసతి గృహాలకు దాతలు తమ సొంత పేర్లను పెట్టుకోరాదంటూ టీటీడీ పాలకమండలి తీర్మానం చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయంలో కఠినంగా వ్యవహరించిన కూటమి ప్రభుత్వం.. ఇందులో భాగంగా వసతిగృహాల పేర్లు మార్పు చేస్తోంది.

ఇది ఇలా ఉండగా, తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం టీటీడీ, జిల్లా పోలీసులు ‘MAY I HELP YOU’ సేవలను ప్రారంభించారు. ఈ సేవ ద్వారా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైతే పోలీసుల సహాయం పొందవచ్చు. తిరుమల కొండపై ప్రధాన ఆలయాలు, లడ్డు, లగేజ్ కౌంటర్లు, బస్టాండ్, అన్నదాన సత్రం వంటి ప్రాంతాల్లో పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉంటారు. ‘MAY I HELP YOU’ జాకెట్ ధరించిన పోలీసులను భక్తులు సంప్రదించవచ్చు.