చంద్రబాబు అరెస్టుపై స్పందించిన రేవంత్ రెడ్డి..ఆయన జాతీయ స్థాయి నేత !

-

చంద్రబాబు అరెస్టుపై పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ అనేది ఒక రాష్ట్రానికి పరిమితమైనది కాదని… చంద్రబాబు ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదని వెల్లడించారు. చంద్రబాబు జాతీయ స్థాయిలో ప్రభావం చూపించిన వ్యక్తి అంటూ కొనియాడారు.

revanth reddy comments on cbn arrest
revanth reddy comments on cbn arrest

అటువంటి వ్యక్తి అరెస్ట్ గురించి నిరసనలు తెలిపితే అందుకు అనుమతి ఇవ్వాలి కానీ అడ్డుకుంటే ఎలా? ఆంధ్ర ప్రాంతానికి చెందిన కమ్మ వారి ఓట్లు కావాలి కానీ వారికి నిరసనలు తెలిపే హక్కు లేదా ? అంటూ మంత్రి కేటీఆర్‌కు చురకలు అంటించారు పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి.

చంద్రబాబు అరెస్ట్ తెలంగాణకు సంబంధం లేదు అనుకుంటే తెలంగాణ ఉద్యమం సమయంలో అమెరికాలో వైట్ హౌజ్ ముందు ఎందుకు నిరసనలు తెలిపారు ? అని మండిపడ్డారు. నిరసన తెలిపే వారిని అడ్డుకుంటే వారు ఈసారి బీఆర్ఎస్ పార్టీ చెంపలు వాయిస్తారని హెచ్చరించారు. ఈసారి ఎన్నికల్లో ఆంధ్ర సెటిలర్స్ బీఆర్ఎస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెడతారని వార్నింగ్‌ ఇచ్చారు పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news