మొన్న చంద్రుడు.. నిన్న సూర్యుడు.. ఇవాళ శుక్రగ్రహంపై ప్రయోగాలకు ఇస్రో రెడీ

-

మొన్నటి చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశంగా భారత్ ప్రఖ్యాతి గాంచింది. నిన్న సూర్యుడి గుట్టు తెలుసుకునేందుకు ఆదిత్య మిషన్ ఎల్1 ను నింగిలోకి పంపింది. ఇక ఇప్పుడు శుక్ర గ్రహంపై పరిశోధనలు చేసేందుకు భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) రంగం సిద్ధం చేస్తోంది.. చంద్రయాన్-3, ఆదిత్య ఎల్1 మిషన్ విజయవంతమైన నేపథ్యంలో త్వరలోనే వీనస్ మిషన్‌ను చేపట్టనుంది.

సౌర వ్యవస్థలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం అయిన శుక్రుడిపై భారత్​ ప్రయోగాలు చేపట్టనుంది. ఇప్పటికే వీనస్​ మిషన్​కు సంబంధించి రెండు పేలోడ్లు అభివృద్ధి చేసినట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. శుక్రుడిపై అధ్యయనం చేయడం వల్ల అంతరిక్ష శాస్త్ర రంగంలోని అనేక ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయని చెప్పారు. శుక్రగ్రహం చాలా ఇంట్రెస్టింగ్​గా ఉంటుందని.. అక్కడి వాతావరణం చాలా మందంగా ఉంటుందని వెల్లడించారు. భూమి కూడా ఏదో ఒకరోజు శుక్రుడు కావచ్చని .. 10,000 సంవత్సరాల తర్వాత భూమి లక్షణాలు మారిపోవచ్చని సోమనాథ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news