తెలంగాణ రాష్ట్రంలోని పెన్షన్ దారులకు రేవంత్ రెడ్డి సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. వృద్ధుల నుండి ఆసరా పెన్షన్ డబ్బులు రికవరీ చేసేందుకు రేవంత్ సర్కార్ కంకణం కట్టుకుంది. కొత్తగూడెం జిల్లాలో ఆసరా పెన్షన్లపై ఇటీవల సర్వే నిర్వహించగా దాసరి మల్లమ్మ (80) అనే వృద్ధురాలు ఆసరా పెన్షన్‌కి అనర్హురాలు అని.. ఇప్పటివరకు ఆమె తీసుకున్న రూ. 1,72,928 తిరిగి ప్రభుత్వానికి 7 రోజుల లోగా చెల్లించాలని ఆమెకు నోటీసు ఇచ్చారు.
దీంతో రేవంత్‌రెడ్డి సర్కార్ పై జనాలు ఫైర్ అవుతున్నారు. ఇది ఇలా ఉండగా, రైతులు ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే రైతు భరోసా రాదేమోనని భయపడాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతు భరోసా అమలుపై వనపర్తిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘రుణమాఫీని ఆగస్టులో చేస్తాం. దీనివల్ల పెట్టుబడి సాయం కొంచెం ఆలస్యం కావచ్చు. ప్రకృతి వైపరీత్యాలతో పంటనష్టం జరిగితే రూ. 10 వేల వరకు పరిహారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు.